Telugu News » Adani: గోపాల్ పూర్ పోర్టును కొనుగోలు చేసిన అదానీ.. దాని విలువ ఎన్ని కోట్లంటే..!!

Adani: గోపాల్ పూర్ పోర్టును కొనుగోలు చేసిన అదానీ.. దాని విలువ ఎన్ని కోట్లంటే..!!

భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాల్లో పలు పోర్టులను నిర్వహిస్తున్న ఆదానీ గ్రూప్ తాజాగా మరో పోర్టును దక్కించుకుంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన గోపాల్ పూర్ పోర్టు(Gopalpur Port) ను ఆయన కొనుగోలు చేశారు.

by Mano
Adani: Adani bought Gopalpur port.. How many crores is it worth..!!

దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ(Goutham Adani) దేశంలో ఓడరేవుల(Port) కొనుగోలుపై దృష్టిపెట్టారు. ఇప్పటికే భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాల్లో పలు పోర్టులను నిర్వహిస్తున్న ఆదానీ గ్రూప్ తాజాగా మరో పోర్టును దక్కించుకుంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన గోపాల్ పూర్ పోర్టు(Gopalpur Port) ను ఆయన కొనుగోలు చేశారు.

Adani: Adani bought Gopalpur port.. How many crores is it worth..!!

అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్‌కు గోపాల్ పూర్ పోర్టును విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. తమ ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా ఈ పోర్టును రూ. 3,350 కోట్లకు విక్రయించినట్లు తెలిపింది. 2017లో ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ పోర్టును పల్లోంజీ గ్రూప్ కొనుగోలు చేసింది.

కొద్ది రోజుల కిందట పల్లోంజీ గ్రూప్ మహారాష్ట్రలోని ధరమ్ తర్ పోర్టును రూ. 710 కోట్లకు జేఎస్ డబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్ కు విక్రయించింది. 2015లో ఈ పోర్టును కొనుగోలు చేసిన షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ దాని సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచింది. గోపాల్ పూర్ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు.

పెట్రోనెట్ ఎల్ఎన్జీతో ఇటీవలే ఈ పోర్టు గ్రీన్ ఫీల్డ్ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అదానీ గ్రూప్ ఇప్పటి వరకు ముంద్రాపోర్టు, కృష్ణపట్నం పోర్టు, కరైకల్ పోర్టు, హజిరా పోర్టు, ధామ్రా పోర్టు వంటి ప్రధాన పోర్టుల్లో గరిష్ట వాటాలను కలిగి ఉంది.

You may also like

Leave a Comment