Telugu News » Hyderabad : సంచలనం రేపుతున్న ప్రణీత్ రావు టీమ్ బాగోతాలు.. చివరికి హీరోయిన్ ను కూడా..?

Hyderabad : సంచలనం రేపుతున్న ప్రణీత్ రావు టీమ్ బాగోతాలు.. చివరికి హీరోయిన్ ను కూడా..?

సమాజం కోసం ఏర్పడిన వ్యవస్థను కొందరి ప్రముఖుల సొంతపనులకు వాడుకొన్న అధికారులపై చర్యలకు దిగారు.. ఈమేరకు ఈ కేసులో ఎస్ఐబీ (SIB)లో పని చేసిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి..

by Venu
Phone tapping case: The High Court shocked Praneet Rao.. That petition was dismissed!

తెలంగాణ (Telangana)లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది.. పూట పూటకు ఉత్కంఠంగా సాగుతోంది. వ్యవస్థను భ్రష్టుపట్టించేలా సాగిన ఈ వ్యవహారంలో ప్రముఖ రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.. సమాజానికి ఆదర్శంగా నిలిచి.. న్యాయాన్ని రక్షించవలసిన అధికారులు కొందరు.. రాజకీయ ప్రలోభాలకు లోనై ధర్మానికి వెలకట్టి విలువ తీశారని.. చట్టం అంటే చుట్టం అనేలా ప్రవర్తించారనే విమర్శలు ఎదురవుతున్నాయి..

సమాజం కోసం ఏర్పడిన వ్యవస్థను కొందరి ప్రముఖుల సొంతపనులకు వాడుకొన్న అధికారులపై చర్యలకు దిగారు.. ఈమేరకు ఈ కేసులో ఎస్ఐబీ (SIB)లో పని చేసిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.. ఈ ఘనులు ప్రతిపక్షం, స్వపక్షం అనే తేడా లేకుండా వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు ఇలా తాము అనుకున్నవారందరిపై అక్రమంగా నిఘా ఉంచినట్లు విచారణలో బయటపడుతుంది.

ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు (Praneeth Rao) టీమ్ సెలబ్రెటీల విషయంలో చేసిన దుర్మార్గాలు పుట్టలో నుంచి చీమలు వచ్చినట్లుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరి వ్యవహారం వల్ల చివరికి ఓ టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ భర్తతో విడాకుల వరకు వెళ్లిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.. ఇలా ఇంకెంతమంది హీరో హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయో అని చర్చ కూడా మొదలైంది.

ఈ ఫోన్ ట్యాపింగ్ (Phone Taping) ముఖ్యంగా సినీ, రాజకీయ, రియల్టీ, నగల వ్యాపారులను టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అదీగాక నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ఎస్ఐబీ ప్రభాకర్ రావుకు టార్గెట్ చేసిన ఫోన్ నెంబర్లు చేరేవని టాక్ వినిపిస్తోంది. అనంతరం ఆయన నుంచి ప్రణీత్ రావు టీమ్ కు చేరేవని.. తర్వాత అవి ట్యాప్ చేసి అక్రమంగా వారి సంభాషణలు విని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.. ఈ విషయంలో విచారణ మరింత లోతుగా వెళ్ళే కొద్ది ఇంకెన్ని దారుణాలు వెలుగులోకి వస్తాయో అనే చర్చలు మొదలైయ్యాయి..

You may also like

Leave a Comment