పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు మరింత రక్తికట్టిస్తున్నాయి.. మూడు ప్రధానా పార్టీల నేతలు విమర్శలలో కూడా పోటీ పడినట్లుగా ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నారు.. మరోవైపు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, స్కామ్ వంటి వాటిపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ దూకుడుకు ఊపిరాడక సతమతం అవుతున్న గులాబీ దళం.. హస్తాన్ని సైతం గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరించి, నిండా ముంచిన కాంగ్రెస్కు ఓటు వేయవద్దని సూచించారు.. బీజేపీతో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదనే కేజ్రీవాల్, కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఆ పార్టీ అధిష్టానానికి భిన్నంగా ఉందని విమర్శించారు. అక్రమ అరెస్టులను రాహుల్ గాంధీ ఖండిస్తుంటే.. రేవంత్ రెడ్డి సమర్థించినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు..
రాహుల్ గుజరాత్ మోడల్ ఫెయిల్ అంటే.. రేవంత్ అద్భుతమని అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.. అసలు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ ముఖ్యమంత్రా? బీజేపీ ముఖ్యమంత్రా? అని హరీష్ రావు ప్రశ్నించారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేశారు. కానీ ప్రస్తుతం ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో క్షునంగా ప్రజలకు అర్థం అవుతుందని అన్నారు..