Telugu News » Lok Sabha Elections 2024 : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కి సొంత కారు కూడా లేదా..?

Lok Sabha Elections 2024 : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కి సొంత కారు కూడా లేదా..?

గత కొద్ది రోజుల క్రితం తమిళిసై సౌందర్ రాజన్.. తెలంగాణ గవర్నర్‌ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరి.. పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నం అయ్యే పనిలో ఉన్నారు..

by Venu
Governor Tamilisai: Telangana is breathing the gases of freedom: Governor Tamilisai

లోక్‌సభ ఎన్నికల బరిలో కొన్ని కొన్ని చిత్రాలు చోటు చేసుకోవడం కనిపిస్తోంది.. నామినేషన్ అఫిడవిట్ లో ఆస్తులు లేనట్లు.. అసలు కార్లు కూడా లేనట్లు సమర్పించడం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ (Telangana) మాజీ గవర్నర్ (Governor) తమిళిసై సౌందర్ రాజన్ (Tamilasai sounder rajan) సైతం ఒక జిమ్మిక్కు చేసినట్లు సమాచారం..

Telangana Governor Tamilisai Soundararajan Sensational Commentsతమిళనాడు (Tamil Nadu) లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ఈమె.. బీజేపీ (BJP) అభ్యర్ధిగా చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీలో నిలువనున్నారు.. ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. ఈమేరకు తమిళిసై కూడా నామినేషన్ ప్రత్రాలు దాఖలు చేశారు.

ఆ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన మొత్తం ఆస్తులు రూ. 2.17 కోట్లుగా పేర్కొన్నారు.. అదేవిధంగా ప్రస్తుతం రూ. 50 వేల నగదు, రూ. కోటి 57 లక్షలపైగా చరాస్తులున్నట్లు వెల్లడించారు.. మరోవైపు తన పేరిట సొంత కారు కూడా లేదని తెలిపారు. అలాగే తన భర్తకు రూ.3.92 కోట్ల చరాస్తులు, కుమార్తెకు రూ. కోటి విలువైన చరాస్తులు ఉన్నాయని, 4 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు..

ఇక గత కొద్ది రోజుల క్రితం తమిళిసై సౌందర్ రాజన్.. తెలంగాణ గవర్నర్‌ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరి.. పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నం అయ్యే పనిలో ఉన్నారు..

You may also like

Leave a Comment