ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. రెండు కార్లు ఢీకొంటేనే ఘోరంగా ఉంటుంది. అలాంటిది రెండు విమానాలు.. ఊహానే భయం పుట్టించేలా ఉంది కదా !.. కానీ ప్రస్తుతం ఇలాంటి సంఘటన చోటుచేసుకొంది. ఎక్కడని ఆలోచిస్తున్నారా.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో జరిగింది.. కానీ ఈ పెను ప్రమాదం తృటిలో తప్పింది. చావు దగ్గరా వచ్చి వెనక్కి పోయినట్లుగా ఇందులో ప్రయాణిస్తున్న వారు ఊపిరి పీల్చుకొన్నారు..
ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు (Kolkata Airport)లో ఒకే రన్‌వే పైకి ఇండిగో (Indigo), ఎయిర్ ఇండియా విమానాలు (Air India Plane) వచ్చాయి.. ఈ సమయంలో ల్యాండ్ అవుతున్న ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగిపోయింది. కాగా ఇందులో ఉన్న ప్రయాణికులందరు సేఫ్‌గా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు..
మరోవైపు ఈ ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తుకు ఆదేశించింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఎయిర్ ఇండియా లిమిటెడ్‌పై, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.80 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL), విమాన సిబ్బంది అలసట నిర్వహణ వ్యవస్థ (FMS) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించారు. కొన్ని రోజులకే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది..