Telugu News » Rajendranagar : నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్..!

Rajendranagar : నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్..!

అగ్ని ప్రమాదానికి గురైన సమయంలో కోర్టును తరలించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో బుద్వేల్‌తోపాటు చంచల్‌గూడ సమీపంలోని ప్రింటింగ్‌ ప్రెస్‌, సోమాజిగూడ, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.. కాగా చివరికి బుద్వేల్‌లో కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది..

by Venu
high court shocked by prof kodandarams oath taking

రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్‌ (Rajendranagar) మండలం బుద్వేల్‌ (Budvel)లో రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టు (High Court) కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఇటీవల 100 ఎకరాల ల్యాండ్ ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ (DY Chandrachud) శంకుస్థాపన చేశారు..

CJI Chandrachud seeks report on allegations of sexual harassment by UP judge after she seeks permission to end lifeఈమేరకు తెలంగాణ (Telangana) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుద్వేల్‌లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మించనున్నారని సమాచారం.. ఇక పాతబస్తీలో ఉన్న ప్రస్తుత భవనంలో104 సంవత్సరాలుగా హైకోర్టు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టును కొత్త భవనంలోకి తరలించిన తరువాత పాత భవనాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షిస్తూ సివిల్‌ కోర్టు అవసరాలకు వినియోగించనున్నట్లు సీఎం తెలిపారు..

మరోవైపు హైకోర్టు 2009లో అగ్ని ప్రమాదానికి గురైన సమయంలో కోర్టును తరలించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో బుద్వేల్‌తోపాటు చంచల్‌గూడ సమీపంలోని ప్రింటింగ్‌ ప్రెస్‌, సోమాజిగూడ, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.. కాగా చివరికి బుద్వేల్‌లో కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది..

You may also like

Leave a Comment