Telugu News » Raghunandan Rao : బీఆర్ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ కీలక నేత..!

Raghunandan Rao : బీఆర్ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ కీలక నేత..!

అదేవిధంగా ఈ వ్యవహారం జరిగిన సమయంలో కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డిని సైతం మూడో ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు.. మరోవైపు నేడు డీజీపీని కలిసి ఫోన్ ట్యాపింగ్ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు రఘునందన్ రావు మీడియా ముఖంగా వెల్లడించారు..

by Venu

తెలంగాణాలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ ముఖ్యనేతల మెడకు బిగుస్తున్నట్లుగా చర్చలు మొదలైయ్యాయి.. ఇప్పటికే ఈ కేసును సీరియస్ గా తీసుకొన్న అధికారులు.. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై దర్యాప్తు వేగవంతం చేశారు.. కాగా ఈ ఫోన్ ట్యాపింగ్ బారిన పోలీస్ ఉన్నాతాధికారుల నుంచి, మంత్రులు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి..

raghunandan-raoఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోన్న ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ (BJP) నేత రఘునందన్ రావు (Raghunandan Rao) నేడు డీజీపీ (DGP) రవిగుప్త (Ravigupta)కు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) ప్రమేయం ఉందని ఆరోపించారు..

అధికారంలో ఉన్నన్ని రోజులు చీమ చిటుక్కుమన్న ఆయనకు తెలిసేదని.. ప్రతి శాఖను తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన సాగించిన కేసీఆర్ ఇన్వాల్ మెంట్ లేకుండా ఇంత పెద్ద నేరం జరిగిందంటే నమ్మాలనిపించడం లేదని ఆరోపించారు.. అందుకే ఈ కేసులో తొలి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీశ్ రావును చేర్చి దర్యాప్తు ముమ్మరంగా చేయాలని రఘునందన్ రావు కోరారు.

అదేవిధంగా ఈ వ్యవహారం జరిగిన సమయంలో కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డిని సైతం మూడో ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు.. మరోవైపు నేడు డీజీపీని కలిసి ఫోన్ ట్యాపింగ్ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు రఘునందన్ రావు మీడియా ముఖంగా వెల్లడించారు.. ఇక రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు హిట్ ఎక్కుతుందని అనుకొంటున్నారు.. ఈ వ్యవహారంలో చివరికి పెద్ద తలకాయలు చిక్కుకొక తప్పదనే చర్చలు మొదలైయ్యాయి..

You may also like

Leave a Comment