రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఉన్నత స్థాయి మహిళా ఆఫీసర్లు(Women Officers), ఉద్యోగినులు (Employees) పై స్థాయి అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth reddy) దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిని(MissBehave), వేధింపుల(Harassment)కు గురిచేసే అధికారులను గుర్తించడానికి ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశిచ్చినట్లు సమాచారం.
వీరు నిరంతరం మహిళా ఆఫీసర్లు, ఉద్యోగినుల భద్రతపై ఫోకస్ చేయనున్నారు. గతంలో ఏకంగా మహిళా ఐఏఎస్ అధికారిణికి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి వేధింపులకు గురిచేస్తున్నట్లు సచివాలయంలో ప్రచారం జరిగింది. అది కాస్త సీఎం దృష్టికి వెళ్లగా ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది.
ఇకమీదట ఇలాంటివి రిపీట్ కావొద్దని సంబంధిత అధికారులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఎందుకంటే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయన గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. అందుకే రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులు, జిల్లాల్లోనూ పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వినికిడి.ఈ ఇంటెలిజెన్స్ బృందం మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారికి గుర్తించి నేరుగా సీఎంవోకు రిపోర్టు చేయనున్నారు.తద్వారా ఆ అధికారుపై చర్యలు తీసుకోనున్నారు.
ఈ మధ్యకాలంలో కొందరు సీనియర్ ఆఫీసర్లు మహిళా ఆఫీసర్లను, ఉద్యోగులను వేధిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా ఎక్కువైనట్లు సమాచారం. వారి హోదాను అడ్డుపెట్టుకుని వర్క్ పేరిట పర్సనల్ విషయాలు అడుగుతూ పలు రకాలుగా వేధిస్తున్నారని తెలుస్తోంది. అయినప్పటికీ మహిళా ఆఫీసర్లు అటు ఇంట్లో చెప్పుకోలేక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేక సతమతమవుతున్నట్లు తెలిసింది.