Telugu News » Elon Musk: మస్క్ ఔదార్యం..  భారత సంతతి వైద్యురాలికి రూ.2.50కోట్లు సాయం..!

Elon Musk: మస్క్ ఔదార్యం..  భారత సంతతి వైద్యురాలికి రూ.2.50కోట్లు సాయం..!

కొవిడ్ సంబంధిత ట్వీట్ల కారణంగా ఆమెపై భారీ జరిమానా విధించగా మస్క్ స్పందించారు. రూ.2.50కోట్లు సాయం అందించేందుకు ముందుకొచ్చారు.

by Mano
Elon Musk: Musk's generosity.. Rs. 2.50 crore help to an Indian-origin doctor..!

టెస్లా వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్(elon musk) ఔదార్యాన్ని చాటుకున్నారు. న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్న భారతీయ సంతతికి చెందిన ఓ వైద్యురాలికి అండగా నిలిచారు. కొవిడ్ సంబంధిత ట్వీట్ల కారణంగా ఆమెపై భారీ జరిమానా విధించగా మస్క్ స్పందించారు. రూ.2.50కోట్లు సాయం అందించేందుకు ముందుకొచ్చారు.

Elon Musk: Musk's generosity.. Rs. 2.50 crore help to an Indian-origin doctor..!

భారత సంతతికి చెందిన వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్‌(Kulwinder Kaur gill) కెనడా(canada)లో ఇమ్యునాలజీ, పీడియాట్రిక్స్‌లో నిపుణురాలు. 2020 వేసవిలో లాక్‌డౌన్ సమయంలో కెనడాలో ఏర్పడుతున్న ఇబ్బందులపై ఆమె సోషల్ మీడియాలో ధైర్యంగా బహిరంగంగా పోస్టులు చేశారు. లాక్ డౌన్‌తో పాటు వ్యాక్సిన్ తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. దీంతో ఆమె న్యాయ వివాదంలో చిక్కుకున్నారు.

2022లో 1.2మిలియన్ డాలర్ల జరిమానా విధించింది కోర్టు. ఆ క్రమంలో గిల్.. లీగల్ ఫీజు కోసం క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా సాయం కోరింది. అప్పటికే సగం వరకు ఇతరుల ద్వారా సాయాన్ని అందుకున్న ఆమె మరో మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు కేవలం నాలుగురోజులే గడువు మిగిలింది. దీంతో ఎలాన్ మస్క్ స్పందించి 3లక్షల డాలర్లను(రూ.2.50కోట్లు) సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వెల్లడించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X డాక్టర్ గిల్ పక్షాన ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది మాజీ ట్విట్టర్ మేనేజ్‌మెంట్ సహా అక్కడి మీడియా తీసుకున్న నిర్ణయమని తెలిపింది. ఎవరికైనా వారి అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని పేర్కొంది. స్వేచ్ఛా వాక్ ప్రజాస్వామ్యానికి పునాది, దానికి అన్ని రూపాల్లో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తామని వెల్లడించింది. అంతేకాదు అలాంటి వారిని రక్షించడానికి మేము చేయాల్సినంత చేస్తామని మస్క్ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment