హైదరాబాద్ (Hydreabad), గోషామహాల్ (Goshamahal), బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ (ML Rajasingh)ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. హోళీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిన ఘటనలో స్పందించిన ఆయన.. నేటి సాయంత్రం చెంగిచెర్ల (Chengicherla) వెళ్తానని ప్రకటించారు.. ఈ నేపధ్యంలో ఏవైనా ఘర్షణలు జరుగుతాయని భావించిన పోలీసులు ఆయన బయటికి వెళ్ళకుండా హౌజ్ అరెస్టు చేశారు.

మరోవైపు ఎనిమిదో నిజాం అయిన కేసీఆర్ (KCR) హయాంలో హిందువులపై దాడి జరిగిందని, ఇప్పడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో కూడా హిందులపై దాడులు జరుగుతున్నాయని రాజాసింగ్ మండిపడ్డారు.. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇలా అరెస్ట్ లు చేయడం సరికాదని.. ఇదే దాడి వేరొకరిపై జరిగితే ఇలాగే స్పందిస్తారా? అని ప్రశ్నించారు.. ఇక ఈరోజు సాయంత్రం రాజాసింగ్ చెంగిచర్లకు వెళ్తారా? లేదా? అనే అంశం ఉత్కంఠగా మారింది.