Telugu News » Pakistan: చికెన్ సరిగా వండలేదని భార్యను టెర్రస్ పైనుంచి తోసేసిన భర్త.. వీడియో వైరల్..!

Pakistan: చికెన్ సరిగా వండలేదని భార్యను టెర్రస్ పైనుంచి తోసేసిన భర్త.. వీడియో వైరల్..!

మహిళలు ఇళ్లలో చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు.  అలాంటి ఘటనే పాకిస్థాన్‌(Pakistan)లో చోటుచేసుకుంది. చిన్న కారణంతో భర్త ఏకంగా టెర్రస్ పైనుంచి కిందికి తోసేశాడు.

by Mano
Benjamin Nethanyahu: The Israeli Prime Minister is protesting and demanding his resignation..!

సంసార సాగరంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు శరామామూలే. అయితే ఆ గొడవలు శృతిమించితేనే ప్రమాదం. ఇటీవల కాలంలో అలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. మహిళలు ఇళ్లలో చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు.  అలాంటి ఘటనే పాకిస్థాన్‌(Pakistan)లో చోటుచేసుకుంది. చిన్న కారణంతో భర్త ఏకంగా టెర్రస్ పైనుంచి కిందికి తోసేశాడు.

Benjamin Nethanyahu: The Israeli Prime Minister is protesting and demanding his resignation..!

అయితే ఆమె స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral)అవుతోంది.  భార్య ఇంట్లో స్పెసీగా చికెన్(Spicy Chicken) చేయలేదని ఆగ్రహించిన ఓ పాకిస్తానీ తన భార్యను ఎత్తుకొని టెర్రస్ పైనుంచి కిందకు పడేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఓ మహిళపై టెర్రస్ పైనుంచి కింద పడిపోయి ఆర్థనాదాలు పెట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో చుట్టుపక్కల వారు ఏమైందోనని వచ్చి చూసి ఆమెకు సాయం చేశారు. కిందపడిపోయిన మహిళ నొప్పితో బిగ్గరగా అరవడంతో ఆమెను పైకి లేపడానికి ప్రయత్నించారు. కేవలం ఇంట్లో వన్డే కూరలకే ఇలా హింసిస్తున్నాడంటే ఆమెను ఇంట్లో ఇంకెంత హింసిస్తున్నాడోనని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇలాంటి ఎంతో మంది మహిళలు ఇళ్లల్లో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా గడవపచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. గృహహింసకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని చెబుతున్నారు.

 

You may also like

Leave a Comment