Telugu News » Benjamin Nethanyahu: ఇజ్రాయెల్ ప్రధానికి నిరసన సెగ.. రాజీనామా చేయాలంటూ డిమాండ్..!

Benjamin Nethanyahu: ఇజ్రాయెల్ ప్రధానికి నిరసన సెగ.. రాజీనామా చేయాలంటూ డిమాండ్..!

ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం(Israel capital Jerusalem)లో శనివారం రాత్రి లక్షలాది మంది ప్రజలకు నిరసన వ్యక్తం చేశారు. హమాస్ చేతిలో ఉన్న బంధీల విడుదలతో పాటు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

by Mano
Benjamin Nethanyahu: The Israeli Prime Minister is protesting and demanding his resignation..!

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Israeli Prime Minister Benjamin Netanyahu)కి నిరసన సెగ ఎదురైంది. ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం(Israel capital Jerusalem)లో శనివారం రాత్రి లక్షలాది మంది ప్రజలకు నిరసన వ్యక్తం చేశారు. హమాస్ చేతిలో ఉన్న బంధీల విడుదలతో పాటు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

Benjamin Nethanyahu: The Israeli Prime Minister is protesting and demanding his resignation..!

దక్షిణ ఇజ్రాయెల్‌లో గతేడాది అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్ గ్రూపులు చేసిన దాడితో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 32వేల మందికి పైగా మృతిచెందారు. హమాస్ తీవ్రవాదులు దాదాపు 1,200 మందిని హతమార్చారు. 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఇంకా 130 మందికి పైగా ప్రజలు హమాస్ చెరలో బందీలుగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈజిప్టు రాజధాని కైరోలో ఆదివారం మరోసారి చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మరోసారి నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తమవుతుండటం గమనార్హం. తాజాగా జరిగే చర్చలు గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, బందీలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ అందుకు ఒప్పుకునే పరిస్థితిలో లేదని నెతన్యాహు పలుమార్లు వెల్లడించారు.

దీంతో బంధీల విడుదలకు ఆయనే ప్రధాన అడ్డంకిగా మారారని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిరసనకారులు టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో వీధుల్లోకి వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టెల్ అవీవ్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి 16మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. వీటిని మరింత ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment