కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై వరుసగా బీఆర్ఎస్ (BRS) ముఖ్యనేతలు మండిపడుతున్నారు.. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎత్తి చూపుతూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.. ఈ క్రమంలో ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు (Harish Rao) విమర్శలతో విరుచుకుపడ్డారు.. పంటలు కోతలకు వచ్చే సమయంలో కూడా రైతు బంధు ఇవ్వక పోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు..
పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున 4 ఎకరాలకు రైతుబంధు ఇచ్చారని తెలిపారు.. ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కరువు కూడా వెంట తెచ్చిందని విమర్శించారు.. 100 రోజుల పాలనలో 280 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పాలనలో వైఫ్యల్యాన్ని సూచిస్తుందని ఆరోపించారు.. కామారెడ్డి (Kamareddy)కి తెలంగాణ (Telangana) ఉద్యమ చరిత్ర ఉంది. గులాబీ జెండాకు ఊపిరి పోసిన ప్రాంతం ఇదని హరీష్ రావు గుర్తు చేశారు..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ అమలు కావాలంటే ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టాల్సిందేనని పేర్కొన్నారు.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. డిసెంబర్ 3న రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పటివరకు చేయలేదు ఎందుకని ప్రశ్నించారు.. క్రాప్ లోన్ కట్టాలని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇస్తామంటున్నారు. అయినా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ మైనార్టీలను మోసం చేసిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేలా చేయాలని పిలునిచ్చారు.. మా నాయకులను కొనవచ్చు గానీ.. మా కార్యకర్తలను తెలంగాణ ఉద్యమ కారులను కొనలేవని కాంగ్రెస్ పై హరీష్ రావు మండిపడ్డారు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్.. ఇకనైనా జనం కోసం ఆలోచించాలని హితవుపలికారు..