Telugu News » DK Aruna : సీఎం అని చూడకుండా ఇవేం మాటలు.. రేవంత్ పై డీకే అరుణ ఫైర్..!

DK Aruna : సీఎం అని చూడకుండా ఇవేం మాటలు.. రేవంత్ పై డీకే అరుణ ఫైర్..!

మీరు వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా గురించి మాట్లాడే అర్హత కూడా రేవంత్‌రెడ్డికి లేదని మండిపడ్డారు.. పాలమూరు జిల్లా వ్యక్తి సీఎం అయ్యాడని ఆనందించాము..

by Venu
dk aruna fire on cm kcr

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం ఊహించని విధంగా సాగుతోంది. ఇప్పటికే గులాబీ బాస్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతుండగా.. తాజాగా మహబూబ్‌నగర్ (Mahbubnagar) బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు..

DK Aruna: Avoid politics in the name of Ram: DK Arunaనోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాటలు జారి పరువు తీసుకోవద్దని సూచించారు.. నేడు మీడియాతో మాట్లాడిన డీకే అరుణ (DK Aruna).. రేవంత్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఓ ప్రెస్‌మీట్‌లో తనను దొరసాని అంటూ సీఎం మాట్లాడటం తనను తీవ్రంగా భాధించిందని తెలిపారు.. బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఓ మహిళను అగౌరవ పరచడం.. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు..

మీరు వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా గురించి మాట్లాడే అర్హత కూడా రేవంత్‌రెడ్డికి లేదని మండిపడ్డారు.. పాలమూరు జిల్లా వ్యక్తి సీఎం అయ్యాడని ఆనందించాము.. కానీ ఆయన మాట తీరుకు సిగ్గుపడుతున్నట్లు డీకే అరుణ తెలిపారు.. తాను ఎప్పుడు రాజకీయ పరంగా విమర్శలు చేశానే తప్పా.. ఏ నాడు ఎవరిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని పేర్కొన్నారు.. ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన రేవంత్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నువ్వు ఏం పీ..నవ్ చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

You may also like

Leave a Comment