సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజల్లో ఆశించిన మేర అవగాహన రావట్లేదు. బ్లాక్ టికెట్ల దందా కూడా జోరుగా నడుస్తోంది. హైదరాబాద్(Hyderabad)లోని ఉప్పల్(Uppal) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం(Rajiv Gandhi International Stadium) వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ ఏప్రిల్ 5న జరగనుంది.
రాత్రి 7.30గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నె సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. హోమ్ టీమ్ మ్యాచ్ కావడం, అటు ఎంఎస్ ధోనీ ఉండటంతో మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఓ ముఠా. ఇప్పటికే చెన్నై హైదరాబాద్ మ్యాచ్‌కి టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో టికెట్స్ అన్నీ క్లోజ్ అవ్వడంతో పేటీఎం ఐపీఎల్ టికెట్ల అమ్మకాలను నిలిపివేసింది.
అయితే, టికెట్స్ ఆన్లైన్లో అమ్ముతున్నామంటూ సైబర్ ముఠా మోసాలకు దిగుతోంది. క్యూఆర్ కోడ్స్ పంపించి, టికెట్స్‌పై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నకిలీ టిక్కెట్ల అమ్మకంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్పందించారు.
సోషల్ మీడియాలో అనధికారంగా విక్రయిస్తున్న టిక్కెట్ల విక్రయాలతో క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసత్య ప్రచారాలను చూసి టికెట్లు కొని మోసపోవద్దన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో టికెట్లు విక్రయిస్తే తమ దృష్టికి లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.