Telugu News » Hyderabad : ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎంకి ఫిర్యాదు చేసిన డీఎస్పీ..!

Hyderabad : ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎంకి ఫిర్యాదు చేసిన డీఎస్పీ..!

తన ప్రమోషన్‌ ను కన్సిడర్ చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. స్టీఫెన్ రవీంద్ర పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో ఏడాదిన్నర కాలం సర్వీస్‌లో నష్టపోయినట్లు తెలిపారు.

by Venu

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చాక.. ఎన్నో వివాదస్పద సంఘటనలు తెరపైకి వస్తుండటం కనిపిస్తుంది. తాజాగా సైబరాబాద్‌ మాజీ సీపీ, ప్రస్తుత హోంగార్డ్స్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్రపై డీఎస్పీ గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ రవీంద్ర సస్పెండ్‌ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు..

భూ కబ్జాదారులతో చేయి కలిపి, ఎలాంటి విచారణ చేయకుండానే తనను అక్రమంగా సస్పెండ్‌ చేశారని గంగాధర్‌ పేర్కొన్నారు.. దీనివల్ల తన ప్రమోషన్స్ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ లేకుండా ఏడాదిన్నర కాలం సర్వీస్‌ కోల్పోయేలా చేశారని ఆరోపించారు. కాగా సైబరాబాద్ (Cyberabad) సీపీగా స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) ఉన్నప్పుడు గంగాధర్‌‌ నార్సింగి ఇన్‌స్పెక్టర్‌‌గా పనిచేశారు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం పరిధిలోని గ్రామాల మధ్య ఓవర్‌ లాప్‌ భూ వివాదం కేసులు చేశారని ఆరోపణలు వచ్చాయి.. ఈ క్రమంలో గంగాధర్‌‌ను సీపీ స్టీఫెన్ రవీంద్ర సివిల్‌ వివాదాల్లో తలదూర్చాడంటూ సస్పెండ్‌ చేశారు. అనంతరం ఏడాదిన్నర పాటు ఎలాంటి విచారణ జరుపలేదని గంగాధర్ ఆరోపించారు. ఈ కారణంగా తన బ్యాచ్ ఇన్‌స్పెక్టర్లకు ముందే డీఎస్పీలుగా ప్రమోషన్స్ దక్కినా తనకు మాత్రం రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదేవిధంగా తన ప్రమోషన్‌ ను కన్సిడర్ చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. స్టీఫెన్ రవీంద్ర పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో ఏడాదిన్నర కాలం సర్వీస్‌లో నష్టపోయినట్లు తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ పరంగా తనకు తగిన న్యాయం చేయాలని సీఎంను కోరారు. మరోవైపు పలువురు కిందిస్థాయి అధికారులను రవీంద్ర ఇబ్బంది పెట్టారంటూ.. ఫిర్యాదు కాపీని సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, హోంశాఖ, డీవోపీటీకి పంపించారు.

You may also like

Leave a Comment