రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అవినీతి రాజకీయ పునాదులను కదిలిస్తుందని అనుకొంటున్నారు.. ఇప్పటికే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య వార్ నడుస్తోంది. కాగా తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడంపై మహబూబ్‌నగర్ (Mahbubnagar) ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి (Yannem Srinivas Reddy) స్పందించారు.. నేడు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు..
కేటీఆర్ (KTR)కి లా, అడ్మినిస్ట్రేషన్‌పై పరిజ్ఞానం లేదని ఆరోపించిన ఎమ్మెల్యే.. గత కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో వార్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి.. దీని ఆధారంగా విచారణ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశానని అన్నారు. ఎందుకంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందేమో అనే అనుమానం వచ్చింది కాబట్టి ఫిర్యాదు ఇచ్చానని తెలిపారు..
కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్‌లో కూర్చొని పరిపాలన చేశారని క్లియర్‌గా అర్థం అవుతుందని ఆరోపించిన శ్రీనివాస్ రెడ్డి.. ఈ కేసులో ఇప్పటికే అధికారులు సస్పెండ్ అయ్యారు. అయినా లీగల్ నోటీసులు పంపి కేటీఆర్ తమను బెదిరించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రిమాండ్‌లో ఉన్న పోలీసు అధికారులు టాస్క్ ఫోర్స్ వాహనాలలో డబ్బులు చేరవేశామని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు..
అఫీషియల్‌గా ఇందిరాగాంధీ వాహనాలు వాడుకొందని, అలహాబాద్ కోర్టు అనర్హత వేటు వేసిన సంఘటను గుర్తు చేసిన ఎమ్మెల్యే.. దీని ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ అనర్హులే అని అన్నారు.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు ఢిల్లీకి పంపించారని చేసిన వ్యాఖ్యలపై మేము కూడా లీగల్ నోటీసులు ఇవ్వాలనుకొంటే మాకు ఎంత సమయం పడుతుందని మండిపడ్డారు..
మునుగులోడు బై పోల్‌లో సర్వే ఎజెంట్లను కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేసిన శ్రీనివాస్ రెడ్డి.. వాళ్ళ ఎమ్మెల్యేల కదలికలపై ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.. ఒక దశలో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని మీడియాలో కథనాలు వచ్చినట్లు వెల్లడించారు. వందల సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎప్పుడు లేదని కానీ బీఆర్ఎస్ ఆ పని చేసి చరిత్రలో నిలిచిపోయిందని ఎద్దేవా చేశారు..
కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లు అన్ని ప్రగతి భవన్ వేదికగా జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు.. ఈ పాపంలో పాలుపంచుకొన్న అధికారులు సైతం అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని ఒప్పుకొన్నారని వ్యాఖ్యానించారు.. డీజీపీకి తెలియకుండా స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి ఈ వ్యవహారం నడిపించారని అన్నారు..