మెదక్ (Medak) కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మంత్రి కొండ సురేఖ (Konda Surekha) ముందే అవమానం జరిగింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ భార్య కాట సుధా రాణి, నీలం మధు చంప పగల్గొట్టాలని ఉందన్నారు. అయితే ఈ విషయం నేరుగా మంత్రికి చెప్పడంతో విషయం రచ్చ రచ్చగా మారింది. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తుందనే టాక్ వుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరి నేతలు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం మొదట కాట శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చి.. తర్వాత నీలం మధుకి టికెట్ కేటాయించింది.. దీంతో శ్రీనివాస్ వర్గం వ్యతిరేకించడంతో చివరికి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అప్పుడు మొదలైన చిచ్చు అలా రగులుతూనే ఉంది. ఈ క్రమంలో నీలం బీఎస్పీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
కాగా ఎన్నికల సమయంలో కాట శ్రీనివాస్ పై తీవ్ర పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. ఇలా జరిగిన వివాదాలకు సంబంధించిన విషయాలన్నీ కాట శ్రీనివాస్ భార్య, కొండా సురేఖ ముందు ఏకరువు పెట్టారు.. ఆ సమయంలో అక్కడ నీలం మధు సైతం ఉన్నారు. దాంతో ఆయన అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీనివాస్ గౌడ్ కూడా పక్కనే నిల్చోని మౌనంగా ఉండటం విశేషం..
మరోవైపు సుధారాణి మాటలు విన్న మంత్రి కొండా సురేఖ ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినకుండా నీలం మధును తీవ్రంగా విమర్శించడం చర్చాంశనీయంగా మారింది.. మరోవైపు వీరిద్దరి మధ్య జరిగిన సంఘటన గురించి తెలిసిన కార్యకర్తలు ఇంత జరిగాక ఎంపీ అభ్యర్థి గెలుపులో శ్రీనివాస్ గౌడ్ సహాయం చేస్తారా అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు..