Telugu News » Tukkuguda : తుక్కుగూడ జన జాతర సభ ఎందుకో క్లారిటీ ఇచ్చిన భట్టి విక్రమార్క..!

Tukkuguda : తుక్కుగూడ జన జాతర సభ ఎందుకో క్లారిటీ ఇచ్చిన భట్టి విక్రమార్క..!

వ్యక్తిగత కుటుంబ రహస్యాలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా విన్నారని భట్టి ఆరోపించారు..

by Venu
Bhatti Vikramarka: KCR will not talk now.. : Bhatti Vikramarka

తుక్కుగూడ (Tukkuguda)లో జరిగే జన జాతర సభకు కాంగ్రెస్ నేతలు సర్వం సిద్దం చేస్తున్నారు.. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సభ దేశానికి దిశా నిర్దేశం చేయబోతోందని పేర్కొన్నారు. కదం తొక్కుదాం, కాంగ్రెస్ (Congress) తడాఖా దేశానికి చాటుదామంటూ పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఈ జన జాతర సభ నుంచే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ ప్రకటించనుందని తెలిపారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తుందో, తెలంగాణ మోడల్‌గా ఏఐసీసీ నాయకత్వం ఈ సభలో సందేశం ఇవ్వబోతోందని భట్టి వెల్లడించారు. అలాగే బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్‌ను గత పాలకులు వ్యక్తిగతంగా వినియోగించారని విమర్శించారు.

వ్యక్తిగత కుటుంబ రహస్యాలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా విన్నారని భట్టి ఆరోపించారు.. ఈ వ్యవహారం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ అని పేర్కొన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు, గత పాపాలకు బాధ్యత లేదని తప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు..

అధికార దాహం.. కుతంత్రాలకు కుటిలత్వానికి కేరాఫ్ గా మారిన బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని మంత్రి ఎద్దేవా చేశారు. జూన్ నెలలో వచ్చిన వర్షపు నీరును కేసీఆర్ స్టోరేజ్ చేయలేదని, నాగార్జున సాగర్ నీటిని అవసరం లేకున్నా గొప్పల కోసం కిందికి వదిలారని ఆరోపించారు. అలాగే కాళేశ్వరంలో గోదావరి నీటిని నిర్మాణ లోపంతో కిందికి వదలాల్సి వచ్చిందని వెల్లడించారు..

మరోవైపు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చామని..పేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని.. రాబోయే ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించినట్లు వివరించారు.. అదేవిధంగా మూసీ నదిని పునర్జీవింపజేసి లండన్‌లోని థేమ్స్ నదిని మరిపించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.

You may also like

Leave a Comment