తెలంగాణ రాజకీయాలు ఆరోపణలతో.. విమర్శలతో రణరంగాన్ని మరిపిస్తున్నాయి.. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కానీ పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తుందని జనం అనుకొంటున్నారు.. ఇక వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ కి టికెట్ ఇవ్వడానికి ఈ జిల్లాకు చెందిన ఒక్కనాయకుడు దొరకలేదా ? అని ప్రశ్నించారు.
అసలు మెదక్ (Medak)కి వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy)కి సంబంధం లేదని ఆరోపించారు.. ఆయన మూడు ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేసి ఒక్కరోజు కూడా సిద్దిపేట ముఖం చూడలేదని అన్నారు.. గాంధీ విగ్రహానికి దండా వేయని వ్యక్తి,100 కోట్లు ఖర్చు చేస్తాడట అని ఎద్దేవా చేశారు.. లక్షా రూపాయల జీతానికి పనిచేసిన వ్యక్తి రూ1000కోట్లతో 10ఎకరాల భూమి ఎలా కొనుగోలు చేశారో వివరించాలని రఘునందన్ డిమాండ్ చేశారు..
సిద్దిపేట (Siddipet)కు చెందిన వ్యక్తి టికెట్ ఇవ్వడానికి హరీష్ రావు మనుసు ఒప్పలేదని తెలిపిన రఘునందన్ రావు.. ఎంపీ రంజిత్ మొదలుకొని కడియం కావ్య వరకు మీ టికెట్ ని వద్దుని బీఆర్ఎస్ నుంచి పారిపోతున్నారన్నారు.. అసలు పార్టీలో ఉన్న వారిని ఏనాడైనా మనుషుల్లా చూసి విలువ ఇచ్చారా? అని ప్రశ్నించారు.. అధికారం నెత్తికెక్కి.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించి అక్రమ మార్గంలో పదవులు పొందాలని ఆశించారని మండిపడ్డారు..
మరోవైపు కాంగ్రెస్ ఓటు వేసి 17 ఎంపీ స్థానాలు గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారని పేర్కొన్న రఘు నందన్.. 17 స్థానాలు గెలిపించినా పప్పు రాహుల్ ప్రధాని కాలేడని ఆరోపించారు. 20 ఏళ్లుగా దేశం కోసం పనిచేస్తున్న మోడీకి ఓటువేస్తే దేశం బాగుపడుతుందని తెలిపారు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కో సర్పంచ్ 50 లక్షల రూపాయల అప్పుల పాలయ్యారు. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం లక్షల కొట్లు కూడబెట్టుకొన్నారని ఆరోపించారు..