వేసవి వచ్చిందంటే నీటికి కొరత ఉంటుంది.. కానీ ఈ మధ్య బీర్లకు కొరత ఏర్పడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.. అసలే ఎండలు.. ఆపై సూర్యుడు డిగ్రీల మీద డిగ్రీలు పాంప్లిమెంట్ పంచినట్లు పంచేస్తున్నారు.. గత వేసవిలో సైతం రికార్డ్ స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అయితే ఈ సంవత్సరం పూర్తి వేసవి రాకముందే.. మన నగర ప్రజలు ఒంటి మీద సెంట్ కొట్టుకొన్నట్లు.. గొంతులోకి చల్లని బీర్లను దింపుతున్నారు.
సాధారణంగా ఏప్రిల్ (April) నెల వచ్చిందంటే చాలు తెలంగాణ (Telangana)లో ఎండలు హిట్ పుట్టిస్తాయి.. కానీ ఈ సారి మార్చి చివరి వారం నుంచి సూర్యుడు వేడి సెగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.. దీంతో ఊహించని స్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతున్నాయి. అయితే ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి నిమ్మకాయ నీళ్ళు.. లేదా మజ్జిగ తీసుకోవాలి. కానీ కొందరు మాత్రం బీర్లను మంచినీళ్ళలా (Water) తాగేస్తున్నారు..
ముఖ్యంగా మహానగర వాసులు బీర్లను జోరుగా గుటుక్కుమనిపిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో చల్లని బీర్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో మద్యం షాపుల ఓనర్లు పెద్ద పెద్ద ఫ్రీజులను ఉపయోగించే పరిస్థితి నెలకొంది. బ్రాండ్ ఏదైతే ఏంది బాబాయ్.. చల్లగా గొంతులోకి దిగిందా.. లేదా.. అనే డైలాగులతో కిక్కెక్కిస్తున్నారని అనుకొంటున్నారు.
మరోవైపు నగర ప్రజలు రోజు 60 వేల నుంచి 80 వేల కేసుల బీర్లను తాగుతున్నారని అంటున్నారు.. ఇప్పటికే నీటి సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే.. ఈ కారణంగా బీర్ల సరఫరా సరిగా లేదని తెలుస్తుంది. అయినా కొందరు మాత్రం వెనక్కు తగ్గేదేలే అంటున్నారు.. అయితే ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే.. మే నెలలో ఏ రేంజ్ లో బీర్ల అమ్మకాలు ఉంటాయో అని ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు షాపుల యజమానులు..