దేశంలో ఎక్కడైనా సరే ఎన్నికలు వచ్చాయంటే నేతల్లో ఉన్న అపరిచితుడు బయటికి వచ్చి.. తన విశ్వరూపం చూపిస్తాడాని ఓటర్లు అనుకొంటున్నారు. కారణం ఏంటంటే.. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తీవ్రాతి తీవ్రంగా విమర్శలు చేయడం కనిపిస్తుంది. ఈ క్రమంలో నేడు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
కాంగ్రెస్ (Congress)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. మహబూబ్ నగర్ (Mahbub Nagar)లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం బీజేపీ (BJP) చేస్తుందని.. స్వయంగా సీఎం తెలుపడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆయన భావించడం అజ్ఞానానికి సూచనగా పేర్కొన్నారు.. పీసీసీ పదవి వేరు.. సీఎం పదవి వేరు అని తెలిపిన మహేశ్వర్ రెడ్డి.. సీఎం పదవి కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని తెలిపారు.
మీ పార్టీని బయటి వ్యక్తులు కూల్చడం అవసరం లేదని.. మీలో మీరే.. మీకు పోటీగా మారే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఎందుకంటే సెకండ్ పోజిషన్ కోసం కాంగ్రెస్ లో పోటీ పడేవారు ఎక్కువున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు, రేవంత్ కు సేమ్ పోలికలు ఉన్నాయని, ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ మూడు గ్రూపులు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) విమర్శించారు..
రేవంత్ 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా BRS ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని చూస్తున్నట్లు ఆరోపించిన ఆయన.. రేవంత్ కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేయడం గమనించాలని సూచించారు.. అలాగే సీఎం స్థాయిలో ఉన్న ఆయన పార్టీ పై కుట్ర జరుగుతుందని అనడం రేవంత్ అసమర్ధతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు.. గేట్లు ఓపెన్ చేసినా.. విండో లను ఓపెన్ చేసినా కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్ళడం లేదన్నారు.
సొంత దుకాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్‌లో ఆయనకి కంఫర్ట్ లేదన్నారు.. ఆయనలా మేము గేట్లు ఎత్తే అవసరం లేదన్నారు. ఉప ఎన్నికలు వస్తే శ్రీరామ్ అంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదని వాళ్ళ మధ్య విభేదాలే వాళ్ళను వీక్ చేస్తాయని ఎద్దేవా చేశారు.. బీజేపీ ప్రజలను నమ్ముకుందని పేర్కొన్నారు..
మరోవైపు కాంగ్రెస్ లో 5 గురు షిండేలు ఉన్నారని తెలిపిన మహేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్లాన్ A అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ B అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు.. అనే అర్థాలున్నట్లు వెల్లడించారు. రేవంత్ టెన్షన్ తట్టుకొలేక ఒక IPS అధికారి గుండెపోటుతో మరణించారని ఎద్దేవా చేశారు..
భట్టి విక్రమార్క మీద కాంగ్రెస్ లో కుట్ర జరుగుతుందని ఆరోపించారు.. యాదగిరి గుట్టలో ఆయనను కింద కూర్చోబెట్టారు.. ఆయన డ్రైవర్ ను కొట్టారన్నారు. సెకండ్ పోజిషన్ నుంచి భట్టి విక్రమార్క ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు..