బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(ktr) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యర్థ్య ఆరోపణలను తిప్పి కొట్టాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ చానెల్ డిబెట్‌లో పాల్గొన్న మాజీ మంత్రి ఈ సందర్బంగా మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిగా.. కారు పార్టీ రెండో స్థానానికే పరిమితం అయ్యింది. హస్తం పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 65 స్థానాలు రాగా, బీఆర్ఎస్‌కు 39 స్థానాలు వచ్చాయి.
అయితే, హైదారాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అసెంబ్లీ స్థానాలు రాలేదు. హైదరాబాద్ పరిధిలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ మాత్రం హైదరాబాద్ పరిధిలోనే అత్యధిక స్థానాలు దక్కాయి.
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు తమకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థును గెలిపించారని గుర్తుచేశారు. ఈ విషయంలో నగరంలో జీవించే ఆంధ్రాప్రజలు తెలివిగా ఆలోచించారని అన్నారు. వారు చైతన్య వంతులు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదన్నారు. ఈ విషయంలో ఆంధ్రాప్రజలు తెలంగాణ ప్రజల కంటే బెటర్ అని కేటీఆర్ తెలిపారు.