Telugu News » Sukhesh Chandra Shekhar: జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ.. సంచలన ఆరోపణలు..!

Sukhesh Chandra Shekhar: జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ.. సంచలన ఆరోపణలు..!

ఈ సారి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్‌లను ఉద్దేశించి లేఖలో సంచలన విషయాలను వెల్లడించాడు. వారంతా తీహార్ జైల్లో సంతృప్తిగా ఉన్నారని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. జైలు శాఖ అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నాడు.

by Mano
Sukhesh Chandra Shekhar: Another letter of Sukhesh Chandra Shekhar from jail.. Sensational allegations..!

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్(Sukhesh Chandra Shekhar) మండోలి జైలు నుంచి మరో లేఖను విడుదల చేశాడు. ఈ సారి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్‌లను ఉద్దేశించి లేఖలో సంచలన విషయాలను వెల్లడించాడు. వారంతా తీహార్ జైల్లో సంతృప్తిగా ఉన్నారని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. జైలు శాఖ అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నాడు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌లను వెంటనే మానుకోవాలని జైలు అధికారి ధనుంజయ రావత్  బెదిరిస్తున్నాడని ఆరోపించాడు.

Sukhesh Chandra Shekhar: Another letter of Sukhesh Chandra Shekhar from jail.. Sensational allegations..!

మూడు, నాలుగు రోజుల నుంచి జైలు అధికారులతో తనపై బెదిరింపులకు పాల్పడిన మీకు గవర్నర్, హోంశాఖ, సీబీఐతో దర్యాప్తు చేయబడుతుందని హెచ్చరించాడు. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్(Kejriwal), నేను, సత్యేంద్ర జైన్ జైలు అధికారులు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ల ట్రైలర్‌ను విడుదల చేస్తానని సుఖేశ్ చంద్రశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నాడు.

కేజ్రీవాల్‌కు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా అంటూ.. తీహార్ క్లబ్‌లో మరో మూడు స్లాట్‌లను సిద్ధం ఉంచండి అంటూ పేర్కొన్నాడు. నేతలందరి బండారం బయటపెడతానని వెల్లడించాడు. మరో ముగ్గురు స్నేహితులు తీహార్ జైలుకు రాబోతున్నారంటూ సూచన ప్రాయంగా తెలిపాడు. విచారణ సమయంలో సాక్ష్యాలను ప్రశ్నలను ఎదుర్కొనే సమయంలో త్వరలోనే మనం కలుద్దామని సెటైర్ వేశాడు.

‘నేను ఎవరికీ భయపడను. దేనినీ ఆపను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రతీ విషయాన్ని బయటపెడతా. మీరు నాపై ఎంత ఒత్తిడి తెచ్చినా నేను అదేపనిని కొనసాగిస్తాను.  కైలాస్ గెహ్లాట్ సూపరింటెండెంట్, ఇతర జైలు అధికారుల ద్వారా మీరు ఎలాంటి ఒత్తిడి తెచ్చినా మీ విషయాలను మరింత బహిర్గతం చేస్తాను. కేజ్రీవాల్ జీ.. మీరు నా రాజ్యసభ సీటు కోసం 50కోట్లు తీసుకున్నారు. మీ సూచన మేరకు నేను మీ ఫామ్ హౌస్‌లో డెలివరీ చేసిన డబ్బు దానికి సంబంధించిన అన్ని వాట్సప్ చాట్‌లు కూడా నా దగ్గర ఉన్నాయి’ అని సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు.

You may also like

Leave a Comment