కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేడ్కర్(Ambedkar) పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ(BJP) పాలన సాగుతోందన్నారు. బడుగు బలహీనర్గాలు, దళితులు, ఆదివాసుల అభ్యున్నతికి నరేంద్ర మోడీ(Modi) ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పదేళ్లు నిర్విరామంగా మోడీ చేస్తున్న కృషి ఫలితంగానే అంబేడ్కర్ కలలు సాకారం అవుతున్నాయన్నారు.
పేదలకు న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా మోడీ ప్రభుత్వం భావిస్తోందని వ్యాఖ్యానించారు. కేవలం విద్యా ఉద్యోగాలకే కాకుండా పారిశ్రామిక వేతలుగా తయారు చేయడానికి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. వందల కోట్లు ఖర్చుపెట్టి పంచ తంత్ర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
కొంత మంది రాజ్యాంగాన్ని మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో అసమానతలకు గురి కాకుండా కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగుతోందని వెల్లడించారు. అవకాశం వచ్చినప్పుడల్లా దళితులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో మోడీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. 75 సంవత్సారాల స్వాతంత్ర్య దేశంలో మొదటి సారి ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేసింది మోడీ ప్రభుత్వం అని తెలిపారు. గత ప్రభుత్వాలు, గత పాలకులు విస్మరించిన అణచివేసిన వర్గాలను ఎంచుకుని వారికి పెద్ద పీట వేస్తుంది మోడీ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.