దేశంలో ఒకవైపు సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతుండగా.. మరోవైపు మనుషుల మధ్య నమ్మకంగా తిరుగుతున్న వారు మోసగాళ్ల అవతారం ఎత్తుతున్నారు.. ఇందుకు పవిత్రమైన వృత్తులను అస్త్రాలుగా వాడుతున్నారు.. ముఖ్యంగా నిరుద్యోగులు (Unemployees) ఉద్యోగాల కోసం ఆశపడటం.. అలాంటి వారిని కనిపెట్టి.. లక్షల్లో కొల్లగొట్టడం ప్రస్తుత సమాజంలో కామన్ గా మారిపోయింది. కాగా ఇలాంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ (East Zone Task Force) పోలీసులు (Police).. సోమ్లానాయక్ను అదుపులోకి తీసుకొన్నారు.. కాగా వారు జరిపిన ప్రాథమిక విచారణలో కేటుగాడు ఉద్యోగాల పేరు చెప్పి పలువురి నుంచి రూ.11 లక్షలు వసూలు చేసినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు..
ఇదిలా ఉండగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటున్న యువతకు నిరాశే ఎదురువుతోంది. వాళ్ల ఆశలను ఆసరగా చేసుకుని అక్రమార్కులు అందినకాడికి దొచుకుంటున్నారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిలువునా మోసం చేస్తున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక్కచోట బయటపడటం కనిపిస్తోంది.