Telugu News » BJP : కాంగ్రెస్ లో అసమర్థుడిగా మిగిలిపోతున్న సీఎం.. నిజామాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

BJP : కాంగ్రెస్ లో అసమర్థుడిగా మిగిలిపోతున్న సీఎం.. నిజామాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

రాముడు అడుగు జాడలో కేటీఆర్ నడిచి వుంటే అర్ధ రాత్రి ట్వీట్లు పెట్టే పరిస్థితులు వచ్చేవి కావని పేర్కొన్న అరవింద్.. ఆయనకు రాముడి మందిరం కనిపిస్తున్నదుకు సంతోషంగా ఉందని తెలిపారు..

by Venu
Congress graph down in Malkajigiri.. What is in the report of strategist Sunil Kanugulu?

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ (Nizamabad) బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు.. రేవంత్ ఏం మాట్లాడుతున్నారో ఆయకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.. ఆయన మాటలు ఇండియా టీవీలో లోక్ అదాలత్ మొదటి కామేడి షో లా అనిపించిందని తెలిపారు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు 40 సీట్ల కంటే మించిరావని జోస్యం చెప్పిన ఎంపీ.. కాంగ్రెస్ లో రేవంత్ భవిష్యత్ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు..

dharmapuri arvind sensational comments on congress partyఅదేవిధంగా రేవంత్ కు ఇంకా 15 ఏళ్ల వరకు ఆక్టీవ్ రాజకీయం చేసే అవకాశం ఉందని తెలిపిన అరవింద్.. ఆయన సమర్థుడే కానీ కాంగ్రెస్ (Congress)లో అసమర్థుడిగా మిగిలిపోతున్నారని విమర్శించారు.. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్న రేవంత్ ఆయన దారిలో వెళ్లేందుకు సిద్దమవున్నారా ? అని ప్రశ్నించారు.. ఆయన మరో రాజ్ పాల్ యాదవ్ లా తయారు అవుతున్నారని పేర్కొన్నారు..

కవిత లేని నిజామాబాద్ రాజకీయాలు.. ఆల్కహాలిక్ ఫ్రీ పోటీలా ఉందని సెటైర్ వేసిన ఎంపీ.. రేవంత్ బీజేపీలోకి వస్తారని కేటీఆర్ (KTR)కు ఎందుకు అనిపించిందో అని ప్రశ్నించారు.. ఒకవేళ ఆయన మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు.. మరోవైపు జీవన్ రెడ్డి నిజామాబాద్ లో అజాది అజాది అనుకుంటూ తిరుగుతుంటే.. పాకిస్థాన్ లో తిరుగుతున్నట్టు ఉందని విమర్శించారు..

రాముడు అడుగు జాడలో కేటీఆర్ నడిచి వుంటే అర్ధ రాత్రి ట్వీట్లు పెట్టే పరిస్థితులు వచ్చేవి కావని పేర్కొన్న అరవింద్.. ఆయనకు రాముడి మందిరం కనిపిస్తున్నదుకు సంతోషంగా ఉందని తెలిపారు.. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని మండిపడ్డారు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అల్లం పెడితే, కాంగ్రెస్ బెల్లంపెట్టిందని విమర్శించారు..

కేసీఆర్ (KCR)కి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని జోస్యం చెప్పారు.. దిగజారుడు రాజకీయాలు చేస్తుంది కాబట్టి అభ్యర్థులు కూడా దొరకడం లేదని మండిపడ్డ అరవింద్.. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను తీసుకొచ్చి పోటీలో నిలుపుతుందని ఆరోపించారు.. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చెయ్యడానికి ఫోన్ ట్యాపింగ్ తెర మీదకు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు..

You may also like

Leave a Comment