పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకొంటాయని బీఆర్ఎస్ (BRS) నేతలు నోటికి మైకు కట్టుకొని ప్రచారం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. అలాగే కీలక మార్పులు జరుగుతాయని షాక్ ఇస్తున్నారు.. తాజాగా.. గులాబీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav).. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (KomatiReddy Venkat Reddy)పై సంచలన ఆరోపణలు చేశారు..

అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకుల పాఠశాలల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.. ఈ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.. ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యా శాఖపై ఒక్క సమీక్ష కూడా చేయలేదని ఆరోపించిన శ్రీనివాస్.. ఉమ్మడి రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల బలిదానాలు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు..
సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటే వాటిని పర్యవేక్షించే వారెవరని ప్రశ్నించారు.. గురుకుల పాఠశాలల్లో నాసిరకం భోజనాలు పెడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో భారీగా ఫీజులు పెంచి పేదల రక్తం తాగుతున్నా ప్రభుత్వం చీమకుట్టినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు..