తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. నేతల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. పరువు గురించి పెద్దగా పట్టింపు లేదు.. గెలుపే ముఖ్యం అనేలా వీరి ప్రవర్తన ఉందని అనుకొంటున్నారు ప్రస్తుత తీరును గమనిస్తున్న వారు.. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల్లో విజయాన్ని అందించి.. ఆ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న రేవంత్ ఆ దిశగా వ్యూహాలు రచించడం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్‌తో శుక్రవారం ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.. హైదరాబాద్ (Hyderabad), జూబ్లీహిల్స్ (Jubilee Hills)లోని సీబీఐ కాలని రేవంత్ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉదయం 9 గంటల నుంచి సోషల్ మీడియా టీమ్‌కు లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అందులో మాకు మీడియానే లేదు. కాంగ్రెస్‌కు పేపర్ లేదు. టీవీ లేదు. మా కార్యకర్తలే మా జర్నలిస్టులు. వారే మా రిపోర్టర్లు. వాళ్లే సోషల్ మీడియాలో కింగ్ లు అని పేర్కొన్న రేవంత్.. ఠాగూర్ (Tagore) సినిమాలో ఉన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యక్రమాలను ఒకరు ఇద్దరికీ.. ఆ ఇద్దరు మరో ఇద్దరికీ షేర్ చేస్తారన్నారు..
ఇలా నాలుగు కోట్ల మందికి చేరేవరకు ప్రజలకు చేర్చమని చెబుతున్నట్లు తెలిపి.. వీఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ సోషల్ మీడియా అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) వీడియోలో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. అసెంబ్లీలో సత్తాచాటినం అంటే ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేశారా? అని ప్రశ్నించారు.