గ్రహాంతర వాసుల(Aliens) ఉనికిని కనుగొనేందుకు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తాము ఏలియన్స్‌ను కళ్లారా చూశామని చెబుతుంటే మరికొందరేమో అవి కట్టుకథలని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసుల ఉనికిపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏలియన్స్ ఉన్నారనేందుకు ఆధారలేవీ తనకు ఇప్పటివరకూ దొరకలేదని మస్క్ స్పష్టం చేశాడు.
మలేషియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం 2014 మార్చి 8న కౌలలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళుతూ అకస్మాత్తుగా అదృశ్యమైంది. టేకాఫ్ అయిన 38 నిమిషాల తర్వాత ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. అది దక్షిణ చైనా సముద్రం మీద ప్రయాణిస్తుండగా కనిపించకుండా పోయింది. ఆ ఘటనకు సంబంధించిన డ్రోన్ ఫుటేజీ ఇదేనంటూ ఎక్స్‌లో నెటిజన్ ఓ వీడియోను పంచుకున్నాడు.
ఆ విమానం చుట్టూ వలయాకారంలో తిరుగుతున్న కొన్ని ఆకారాలను ఏలియన్స్‌కు చెందిన వాహనాలని చెప్పడంతో చర్చకు దారితీసింది. వాటి చుట్టూ ఓ శక్తి వలయం కూడా ఉందని, అవి గురుత్వాకర్షణ శక్తిని జయించగలిగాయని చెప్పాడు. ఈ వీడియోను ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేసిన మరో యూజర్.. ఆయన అభిప్రాయం కోరాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. తాను ఇంతవరకూ ఏలియన్స్ ఉన్నాయనేందుకు ఒక్క ఆధారం కూడా చూడలేదని స్పష్టం చేశారు.
దాదాపు పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇండోనేషియా ఎమ్హెచ్ 370 విమానం ఘటన వెనక ఏలియన్స్ ఉండొచ్చన్న ఓ నెటిజన్ అనుమానాలను ఆయన తోసిపుచ్చారు. తనకు ఏలియన్స్ ఉనికిలో ఉన్నట్లు తెలిసుంటే వెంటనే ట్విట్టర్లో వెల్లడించి ఉండేవాడినని అన్నారు. తన స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన 6వేల శాటిలైట్లు భూమిచుట్టూ పరిభ్రమిస్తున్నాయని తెలిపారు. కానీ, గ్రహాంతరవాసులకు సంబంధించి తమకు ఇప్పటివరకూ ఒక్క ఆధారం లభించలేదని పేర్కొన్నారు.
MH370 Drone Video
“This thing is flying so close to the plane that it indicates an operation.”
“This is not a metal sphere this is a plasma field around the orb.”
“It’s like their own gravity well that they’re pulling forward.”#MH370x #MH370
— Ashton Forbes (@JustXAshton) April 26, 2024