పార్లమెంట్ ఎన్నికలు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.. ప్రవాహంలా సాగుతున్న విమర్శలు వివాదాలకు దారి తీస్తున్నాయి.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith sha)కు సంబంధించిన ఫేక్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు (Delhi Police) కేసు నమోదు చేశారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసారనే వార్తలు ప్రచారం అవుతుండటం రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అలాగే అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పలువురికి నేడు సమన్లు జారీ చేసిన పోలీసులు.. మే 1న విచారణకు హాజరు కావాలని సమన్లలో కోరారు. అదీగాక సీఎం రేవంత్ రెడ్డి వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైస్లు విచారణకు తీసుకురావాలని సూచించారు..
ఈ అంశంలో మన్నె సతీష్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్ మొదలగు వీరిపై కేసు నమోదు అయినట్లు సమాచారం.. బీజేపీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు.. ఐటీ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమిత్ షా మాట్లాడినట్లు ఉన్న ఫేక్ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఉంది.
కానీ అసలు వీడియోలో మాత్రం తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని అమిత్ షా మాట్లాడినట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సోమవారం ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ (Gandhi Bhavan)కు వచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో.. కాంగ్రెస్ (Congress) సోషల్ మీడియా ఇన్ఛార్జ్కు నోటీసులు అందజేశారు. సీఆర్పీసీ 91 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ మ్యాటర్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది..