అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ(Himantha biswa sharma)కు సింగపూర్ ప్రతిష్టాత్మక లీ కువాన్ యేవ్ ఎక్జేంజ్ ఫెలోఫిప్ (Lee Kuan Yew Exchange Fellowship)అవార్డు లభించింది. ప్రజాసేవ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డుకు ఆయన్ని ఎంపిక చేశారని అసోం ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన కమిటీకి సీఎం హిమంత బిస్వశర్మ ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న అసోం(assam)కి ఇది గొప్ప గుర్తింపు అన్నారు. ఆయన్ని సింగపూర్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం(Invitation) అందినట్టు సీఎం కార్యాలయం పేర్కొంది.
ఇది ఇలా వుంటే దేశాభివృద్ధికి, సింగపూర్ తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సహకారానికి గుర్తుగా అత్యుత్తమ వ్యక్తులకు ఆ అవార్డును సింగపూర్ అందజేస్తూ వస్తోంది. సింగపూర్ ప్రధాని అయిన లీ కువాన్ ఆ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరిట ఈ అవార్డును ప్రారంభించారు.
రాష్ట్ర అభివృద్ధికి బిస్వశర్మ చేసిన సేవలు, అంతర్జాతీయ సామరస్యానికి ఆయన చేసిన కృషికి గుర్తింపు ఈ అవార్డుకు ఎంపిక చేశారని సింగపూర్ ప్రభుత్వ వర్గాు వెల్లడించాయి. గతంలో కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరి, మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాలకు ఈ అవార్డు లభించింది.