Telugu News » Canada: కెనడాలో మరో ఖలిస్థానీ దారుణ హత్య!

Canada: కెనడాలో మరో ఖలిస్థానీ దారుణ హత్య!

హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య విషయంలో పవన్‌ కుమార్‌ రాయ్‌ జోక్యం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు

by Sai
another khalisthan linked gangster sukhdool singh assassinated in canada

ఖలిస్థానీ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యపై కెనడా, భారత్ మధ్య వివాదం చల్లారకముందే కెనడాలో మరో సంచలన హత్య జరిగింది. కెనడాలో గ్యాంగ్ స్టర్ల అంతర్గత వార్‌లో సఖ్‌దూల్‌సింగ్ అకాను ప్రత్యర్ధులు హతమార్చారు. భారత్ లోని పంజాబ్ కు చెందిన సఖ్‌దూల్‌సింగ్‌పై భారత్ లో అనేక క్రిమినల్ కేసులున్నాయి. తప్పుడు దృవపత్రాలతో సుఖ్ దూల్ 2017లో భారత్ నుంచి కెనడాకు పారిపోయాడు. సఖ్‌దూల్‌సింగ్ పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన గ్యాంగ్ స్టర్.

another khalisthan linked gangster sukhdool singh assassinated in canada

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈక్రమంలో కెనడాలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్యకు గురికావడం మరో సంచలనానికి దారి తీసినట్లైంది. ఖలిస్థాన్ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా అనుచరుడైన సుఖ్దూల్ సింగ్ కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో ప్రత్యర్ధుల చేతిలో హతమయ్యాడు. గ్యాంగ్ స్టర్ల అంతర్గత పోరులో ఈ హత్య జరిగింది.

సుఖ్దూల్ సింగ్ పై భారత్ లో దాదాపు ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో అతను నకిలీ దృవపత్రాలతు 2017లో పాస్ పోర్ట్ సంపాదించి కెనడాకు పారిపోయాడు. ఈక్రమంలో ఈ ఏడాది జూన్ లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యకు గురైయ్యాదు. ఇతని హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది రెండు దేశాల మద్య దౌత్య యుద్ధానికి దారితీసింది. ఇదే సమయంలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్యకు గురికావడం గమనార్హం.

కాగా.. హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య విషయంలో పవన్‌ కుమార్‌ రాయ్‌ జోక్యం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంట్లో భాగంగా కెనడాలోని భారత రాయబార కార్యాలయం నుంచి తాజాగా సీనియర్‌ అధికారి పవన్‌ కుమార్‌ రాయ్‌ను బహిష్కరించడంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది.

దీంతో ఈ పవన్ కుమార్ రాయ్ ఎవరు..? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కెనడాలో రా (భారత గూఢచార సంస్థ) విభాగ అధిపతిగా పవన్ కుమార్ రాయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ కుమార్ రాయ్ పంజాబ్ క్యాడర్, 1997 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి. 2010, జులై 1 నుంచి సెంట్రల్ డిప్యూటేషన్‌పై ఉన్నారు. కెనడాలో ఇండియన్ ఇంటెలిజన్స్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. 2018 డిసెంబరులో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమితుడయ్యారు. అలాగే, కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ గానూ పనిచేశారు.

పవన్‌ కుమార్‌ రాయ్‌ సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్లకముందు పంజాబ్‌లో విధులు నిర్వర్తించారు. అమృత్‌సర్‌లో సీఐడీ ఎస్పీగా పనిచేశారు. 2008 జులైలో జలంధర్‌లో అదే శాఖలో సీనియర్ ఎస్పీగా ఆయన పదోన్నతి పొందారు.

You may also like

Leave a Comment