Telugu News » Farmers Protest: ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టిన రైతులు.. మరోసారి చర్చలకు కేంద్రం పిలుపు..!

Farmers Protest: ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టిన రైతులు.. మరోసారి చర్చలకు కేంద్రం పిలుపు..!

రైతుల(Farmers)తో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు (Farmers' Unions) మరోసారి ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు పంజాబ్-హరియాణా సరిహద్దు శంభు ప్రాంతం వద్ద రైతులు ప్రయత్నించారు.

by Mano
Farmers Protest: Farmers who took up the 'Chloe Delhi' program.

రైతుల(Farmers)తో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు (Farmers’ Unions) మరోసారి ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు పంజాబ్-హరియాణా సరిహద్దు శంభు ప్రాంతం వద్ద రైతులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అన్నదాతలను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు(Security forces) టియర్ గ్యాస్(Tear gas)ను ప్రయోగించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Farmers Protest: Farmers who took up the 'Chloe Delhi' program.

రైతుల ఢిల్లీ చలో కార్యక్రమం నేపథ్యంలో దిల్లీ-గురుగ్రామ్‌, దిల్లీ-బహదూర్‌గఢ్‌ సహా ఇతర ప్రాంతాల్లో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, హరియాణాలోని రెండు సరిహద్దు ప్రాంతాలై టిక్రీ, సింఘూను కాంక్రీట్‌తో చేసిన వివిధ అంచెల బారికేడ్లు, ఇనుప మేకులుసహా పోలీసు, పారా మిలిటరీ బలగాలను భారీగా మోహరించటం ద్వారా సరిహద్దులను దాదాపు మూసివేశారు.

అయితే, ఇప్పటికే పలుమార్లు రైతులతో చర్చించిన కేంద్ర ప్రభుత్వం, మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. ఐదో విడత చర్చలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. “రైతుల డిమాండ్లపై మరోసారి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చర్చలకు రైతు సంఘం నాయకులను మరోసారి ఆహ్వానిస్తున్నాను. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం ముఖ్యం” అని పేర్కొన్నారు.

అదేవిధంగా కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముండా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంఎస్‌పీ, పంట మార్పిడి, వ్యర్ధాల దహనంపై మరోసారి చర్చలకు రావాల్సిందిగా రైతులను ఆహ్వానిస్తున్నాం. గత ఆందోళనలో రైతులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఎత్తివేతపై చర్చిస్తాం. శాంతి నెలకొనాలంటే చర్చలు చాలా ముఖ్యం. రైతుల వైపు నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. చర్చలకు వచ్చి వారి వైఖరిని తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

మరోవైపు, సరిహద్దుల వద్ద రైతులు తీసుకొచ్చిన జేసీబీ యంత్రాలను తక్షణమే అక్కడి నుంచి తరలించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హరియాణాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు.

You may also like

Leave a Comment