Telugu News » Group 1 : గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టులో టీఎస్పీఎస్సీ అప్పీల్…..!

Group 1 : గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టులో టీఎస్పీఎస్సీ అప్పీల్…..!

ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నట్టు పేర్కొంది.

by Ramu
tspsc appeals against cancellation of group 1 prelims exam telangana group 1 exam appeal

గ్రూపు-1 (Group-1) పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పుపై టీఎస్పీఎస్పీ (Tspsc) హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ మేరకు లంచ్ మోషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని డివిజన్ బెంచ్ ను టీఎస్పీఎస్సీ కోరింది. దీనిపై హైకోర్టు డివిజన్ స్పందించింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నట్టు పేర్కొంది.

ఇప్పటికే గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష ఓ సారి రద్దయింది. ఇటీవల రెండో సారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను కూడా హైకోర్టు రద్దు చేయడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. టీఎస్సీఎస్సీ తీరుపై అభ్యర్థులు, పలు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ పరీక్ష రద్దు నేపథ్యంలో అభ్యర్థులు కుంగిపోతున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో టీఎస్పీఎస్పీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

అంతకు ముందు ఉమ్మడి ఏపీలో ఉండగా చివరి నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత తెలంగాణలో గ్రూపు-2 నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.

గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 11 న మరోసారి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షకు 2,33,506 మంది అభ్యర్థులు హాజరవ్వగా అత్యధికంగా 52 వేల మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇటీవల రెండో సారి కూడా పరీక్షను రద్దు చేయడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

 

You may also like

Leave a Comment