Telugu News » BJP : తెలంగాణ బీజేపీలో కుదుపు ఖాయమేనా?

BJP : తెలంగాణ బీజేపీలో కుదుపు ఖాయమేనా?

బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తొలగించిన దగ్గర నుంచి వీరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని.. పైగా, బీఆర్ఎస్ పై చర్యల విషయంలో బీజేపీ మెతక వైఖరి వ్యవహరిస్తోందనే భావనలో ఉన్నారని అంతా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ లో చేరడంతో సహా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

by admin
bjp flag

– అసంతృప్తిలో కొందరు నేతలు
– అధ్యక్షుడి మార్పు తర్వాత గందరగోళం
– సైలెంట్ అయిన కొందరు సీనియర్లు
– రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని ప్రచారం
– వెళ్తూ వెళ్తూ కొందరు నేతల్ని పట్టుకెళ్తారని వార్తలు

తెలంగాణ (Telangana)లో మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ 115 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించేసి యుద్ధ రంగంలోకి దిగింది. అయితే.. బీఆర్ఎస్ (BRS) కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ (BJP)లో గందరగోళం నెలకొందనే ప్రచారం జోరందుకుంది. ఓవైపు చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తుంటే.. బీజేపీలో సీనియర్లు అలకపాన్పు ఎక్కారని.. పార్టీ మార్పుపై చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

bjp flag

బీజేపీ సీనియర్ నేతలు విజయశాంతి, విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, రాజగోపాల్ రెడ్డి లక్ష్యం.. కేసీఆర్ ను గద్దె దించడమే. ఈ విషయాన్నే వాళ్లు ప్రకటిస్తూ గతంలో బీజేపీ గూటికి చేరారు. అయితే.. బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తొలగించిన దగ్గర నుంచి వీరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని.. పైగా, బీఆర్ఎస్ పై చర్యల విషయంలో బీజేపీ మెతక వైఖరి వ్యవహరిస్తోందనే భావనలో ఉన్నారని అంతా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ లో చేరడంతో సహా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

నాయకత్వ లేమి, కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యం పూర్తిగా లేకపోవడంపై విసిగిపోయామ‌ని, గత కొంతకాలంగా దీన్ని తమ మధ్యే మాట్లాడుకుంటున్నామని, కేసీఆర్ ను ఓడించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని రాజగోపాల్ రెడ్డి చెప్పిన‌ట్టు ఓ ఇంగ్లీష్ పత్రికలో కథనం వచ్చింది. అధ్యక్షుడి మార్పు విషయంలో ఓ నేత అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేశారని అన్నారని తెలిపింది. ఈ కథనం ఇప్పుడు బీజేపీ క్యాంప్ లో కలకలం రేపుతోంది. పైగా, దీన్ని రాజగోపాల్ రెడ్డి సహా సీనియర్ల బృందం ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గంగా భావిస్తున్నారు నేతలు. త్వరలో మోడీ, అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. వారితో చర్చలు జరిపి పరిస్థితుల్లో ఏమాత్రం తేడా లేకపోతే సీనియర్ నాయకుల బృందం జంప్ అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

You may also like

Leave a Comment