Telugu News » Tirumala : తిరుమలలో ఘనంగా బాగ్ సవారి ఉత్సవం…!

Tirumala : తిరుమలలో ఘనంగా బాగ్ సవారి ఉత్సవం…!

సాయంత్రం 4.30 గంటలకు స్వామి వారు వైభవోత్సవ మండపం నుంచి బయలు దేరారు.

by Ramu
Tirumala Bhag savari in grand scale

తిరుమల (Tirumala) లో ‘భాగ్‌సవారి’ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవా (Brahmotsavalu) లు పూర్తి అయిన మరుసటిరోజు ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు స్వామి వారు వైభవోత్సవ మండపం నుంచి బయలు దేరారు. అక్కడి నుంచి అప్రదక్షణగా అనంత ఆల్వార్ తోటకు స్వామి వారు చేరుకున్నారు.

Tirumala Bhag savari in grand scale

అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి స్వామి వారు తిరిగి ఆలయ ప్రవేశం చేశారు. దీంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు బాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు.

పురాణ ప్రాశస్త్యం ప్రకారం…. భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించేందుకు స్వామి వారు శ్రీదేవి సమేతంగా అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. అప్పుడు తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి కట్టిపడేస్తారు. స్వామివారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రవేశించి అదృశ్యం అవుతారు.

దీంతో తన భక్తిని పరీక్షించేందుకు సాక్షాత్తు ఆ స్వామి వారే స్వయంగా మానవ రూపంలో వచ్చారని అనంత ఆళ్వార్ విషయం గ్రహిస్తారు. వెంటనే పశ్చాతాపం ప్రకటించి అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేస్తారు. అమ్మవారిని పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తారు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని వరమిస్తారు.

You may also like

Leave a Comment