Telugu News » Telangana : తెలంగాణాలో మొదలైన పొలిటికల్ గేమ్.. రాష్ట్రానికి అమిత్ షా..!!

Telangana : తెలంగాణాలో మొదలైన పొలిటికల్ గేమ్.. రాష్ట్రానికి అమిత్ షా..!!

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Sha) రాష్ట్రానికి రానున్నారు. అమిత్ షా అధికారిక షెడ్యుల్ కూడా ఖరారైంది. ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు.

by Venu

తెలంగాణలో (Telangana) ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) నేతలు దూకుడు పెంచి సభల మీద సభలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ (BJP) కూడా పాగా వేయాలని ప్రణాళికలను సిద్దం చేసుకొంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Sha) రాష్ట్రానికి రానున్నారు. అమిత్ షా అధికారిక షెడ్యుల్ కూడా ఖరారైంది. ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు.

జనగర్జన పేరిట ఆదిలాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న అమిత్ షా సమయాభావం కారణంగా సాయంత్రం హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో నిర్వహించాలనుకున్న సభను రద్దు చేసుకున్నట్టు సమాచారం. లేదంటే ఒకేరోజు రెండు సభలను విజయవంతం చేయాలనే ఆలోచనలో కేంద్ర హోంమంత్రి ఉన్నారట..

ఇక తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్ గమనిస్తే.. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 1:45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:35 గంటలకు ఆదిలాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరుతారు. ఆదిలాబాద్ లో జరిగే జనగర్జన సభలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాల్గొని అనంతరం శంషాబాద్‌లోని హోటల్ నొవాటెల్‌కు సాయంత్రం 5:15 గంటలకు అమిత్ షా రీచ్ అవుతారు.

ఆ తర్వాత హోటల్‌లో ముఖ్య నేతలతో, మేధావులతో సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు అమిత్ షా. కొద్దిరోజుల క్రితం మోదీ కూడా రాష్ట్రానికి వచ్చి పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి ముఖ్యనేతల రాకలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారిందట..

You may also like

Leave a Comment