అసలే గాల్లో ప్రయాణం. ఏదైనా జరగరానిది జరిగితే ప్రాణంతో ఇంటికి చేసుకోవడం కష్టం అందుకే విమాన ప్రయాణం అంటే కాస్త రిస్క్ అనుకుంటారు. కానీ తప్పదు మరీ మనుషుల అవసరాలు అలాంటివి. ఇక తాజాగా విమాన ప్రయాణికులను హడలెత్తించే సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) చోటు చేసుకోంది.
విమానం హైజాక్ (Plane Hijack) చేస్తామని బెదిరిస్తూ వచ్చిన మెయిల్ (Mail) ప్రయాణికులతో పాటు అధికారులను కంగారూ పెట్టింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయ బోతున్నట్టు ఓ అగంతకుడు మెయిల్ చేయడంతో ఎయిర్ పోర్టు (Airport) అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే దుబాయ్ (Dubai) వెళ్లే విమానాన్ని ఆపి క్షుణ్నంగా తనిఖీలు చేశారు.
విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించిన వారు, విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఒక్క అంగుళం కూడా వదలకుండా.. సీఐఎస్ఎఫ్ (CISF) పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. మరోవైపు టెక్నికల్ సిబ్బంది మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరాతీసే పనిలో పడ్డారు. కాగా ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారనే కోణంలో ఎంక్వరీ మొదలు పెట్టిన అధికారులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.