Telugu News » Thirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. పలు సేవలు రద్దు..

Thirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. పలు సేవలు రద్దు..

ప్రస్తుతం పెరటాసి నెల, దసరా సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు వస్తారని అంచనాలతో టీటీడీ, అక్టోబర్ 14 నుంచి 23 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. అందువల్ల టీటీడీ సైతం భారీ ఏర్పాట్లు చేసింది.

by Venu

తిరుమల (Thirumala) లో అక్టోబర్ 15 నుండి జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకి (Navratri Brahmotsavam) టీటీడీ (TTD) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరుగనుండగా, అక్టోబర్ 19న జరిగే గరుడవాహన కార్యక్రమాన్ని సాయంత్రం 6.30 గంటల నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుల వారి ఊరేగింపు ఆలయ మాడ వీధుల్లో చేపడతారు.

ప్రస్తుతం పెరటాసి నెల, దసరా సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు వస్తారని అంచనాలతో టీటీడీ, అక్టోబర్ 14 నుంచి 23 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. అందువల్ల టీటీడీ సైతం భారీ ఏర్పాట్లు చేసింది. మాడవీధుల్లో వాహన సేవలు తిరిగే సమయంలో ఎటువంటి తోపులాటలు తొక్కిస్లాట్లు జరగకుండా భారీ క్యూ లైన్లు, భారీ గేట్స్ ఏర్పాటు చేసింది.

టిడిపి విజిలెన్స్ తో పాటు తిరుపతి స్థానిక పోలీసుల సహకారంతో భద్రత చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి, తిరుపతి ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై చర్చించారు. తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయంలో మూల మూర్తి దర్శనంతో పాటు, వాహన సేవ తిలకించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

You may also like

Leave a Comment