Telugu News » KCR : బీజేపీ మాటల తూటాలు.. ఇరకాటంలో కేసీఆర్..!!

KCR : బీజేపీ మాటల తూటాలు.. ఇరకాటంలో కేసీఆర్..!!

7 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని ప్రజలను మభ్య పెడుతున్నారంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కొన్నాళ్లుగా సైలంట్ ఉన్న బండి సంజయ్ కూడా కేసీఆర్ పై విరుచుకు పడ్డారు.

by Venu

తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) నేతలు దూకుడు పెంచారు. వరుసగా సీఎం (CM) కేసీఆర్ (KCR) పై పలు కోణాల్లో విమర్శలు చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ (Congress) నేతలు కూడా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని, రాష్ట్రంలో మార్పు రావాల్సి ఉందని కిషన్ రెడ్డి అన్నారు.. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పు ఇచ్చిందని తెలిపారు.

 

కేంద్రం చిత్తశుద్దితో సహకారం అందిస్తుంటే వీళ్ళు దోపిడీ చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 7 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని ప్రజలను మభ్య పెడుతున్నారంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కొన్నాళ్లుగా సైలంట్ ఉన్న బండి సంజయ్ కూడా కేసీఆర్ పై విరుచుకు పడ్డారు.

కృష్ణా జలాలలో 299 టీఎంపీలకు సీఎం సంతకం పెట్టిండా లేదా అంటూ ప్రశ్నించారు. కృష్ణా జలాల కోసం మోదీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే కనీసం థాంక్స్ చెప్పని మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ తో కుమ్మకై కేసీఆర్ దక్షిణ తెలంగాణకు ద్రోహం చేశాడని బండి తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం మోటార్లకు మీటర్లు ఎక్కడ పెట్టిందో బీఆర్ఎస్ చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఎన్నికలు అయ్యాక రైతు బంధు, దళిత బంధు ఉండదని ఆరోపించారు. ఘనంగా ఇచ్చిన ఉచిత యూరియా హామీ ఎటు పోయిందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఓటు వేసి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని తెలంగాణ రైతులని, ప్రజలని కోరారు బండి సంజయ్. మొత్తానికి బీజేపీ నేతలు తమ మాటలతో కేసీఆర్ ని ఇరకాటంలో పడేస్తున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.

You may also like

Leave a Comment