Telugu News » Revanth Reddy : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పై రేవంత్​ ఫైర్ ..!!

Revanth Reddy : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పై రేవంత్​ ఫైర్ ..!!

కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి, 51 మందికే బీ ఫారాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రకటించినవి అసాధ్యం అని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారని రేవంత్​రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు సాధ్యమే అని ఇవాళ కేసీఆర్‌ రాజముద్ర వేశారని తెలిపారు.

by Venu
Revanth Reddy: KCR.. Criminal Politician: Revanth Reddy

కేసీఆర్‌ (KCR) విడుదల చేసిన మ్యానిఫెస్టో (Manifesto) పై టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్​రెడ్డి (Revanth Reddy)స్పందించారు. కాంగ్రెస్‌ (Congress) 6 గ్యారంటీలను చూడగానే కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారని అన్న రేవంత్.. కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే ఒక్కో వెయ్యి పెంచుతూ కేసీఆర్‌ కాపీ కొట్టారని మండిపడ్డారు.

కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగానే కేసీఆర్‌ తన అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారని వ్యంగ్యంగా మాట్లాడారు. కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి, 51 మందికే బీ ఫారాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రకటించినవి అసాధ్యం అని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారని రేవంత్​రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు సాధ్యమే అని ఇవాళ కేసీఆర్‌ రాజముద్ర వేశారని తెలిపారు.

కేసీఆర్‌ 9 ఏళ్లల్లో దోచుకున్న రూ.లక్ష కోట్లతో జాతీయ రాజకీయాలు చేస్తానని తిరిగింది నిజం కాదా? అని రేవంత్​రెడ్డి నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తాము డబ్బు, మద్యం పంపిణీ చేయమని ప్రమాణం చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ కూడా డబ్బు, మద్యం పంచదని కేసీఆర్‌ ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. కేసీఆర్‌ ఎప్పుడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిందని.. పూర్తిగా ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు.

You may also like

Leave a Comment