Telugu News » Satyavathi : తెలంగాణ బీజేపీలో విషాదం..!!

Satyavathi : తెలంగాణ బీజేపీలో విషాదం..!!

భద్రాచలంకి చెందిన కుంజా సత్యవతి మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో భద్రాచలం ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు.

by Venu

తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) లో విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం (Bhadrachalam) మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి (Satyavathi) తెల్లవారు జామున గుండె నొప్పితో మరణించారు. ఆదివారం రాత్రి భద్రాచలంలో ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్టు సమాచారం.

ప్రస్తుతం బీజేపీలో చురుకుగా పని చేస్తున్న సత్యవతి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు కుంజా సత్యవతి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటూ హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య సత్యవతి ఇంటికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

ఇక భద్రాచలంకి చెందిన కుంజా సత్యవతి మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో భద్రాచలం ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేశారు. 2014 వరకు భద్రాచలం నియోజకవర్గం శాసన సభ్యురాలుగా పనిచేశారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

You may also like

Leave a Comment