Telugu News » Ponnala: నేడు బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న పొన్నాల

Ponnala: నేడు బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న పొన్నాల

మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేడు బీఆర్ఎస్‌(BRS) పార్టీలో చేరనున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జనగామ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం  ప్రసంగించనున్నారు. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

by Mano
Ponnala will join BRS today

మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేడు బీఆర్ఎస్‌(BRS) పార్టీలో చేరనున్నారు. జనగామ(Janagama)లో జరగనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌(Kcr), పొన్నాలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా, ఇటీవల పొన్నాల జనగామ టికెట్‌ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Ponnala will join BRS today

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జనగామ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం  ప్రసంగించనున్నారు. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

జనగామ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి హైదరాబాద్‌లోని పొన్నాల నివాసానికి వెళ్లి కలిశారు. బీఆర్ఎస్ పార్టీలోకి పొన్నాలను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరేందుకు పొన్నాల లక్ష్మయ్య సిద్ధమయ్యారు.

 

You may also like

Leave a Comment