విజయవాడ(Vijayavada)లోని ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలోని బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటెతో ఈశ్వరుడికి భిక్షను అందించే అంశం అద్భుతమైనది.
నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు సైతం అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారనేది ప్రతీతి. తెల్లవారుజాము 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.
మరోవైపు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం చంద్రఘంట అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవ నిర్వహించనున్నారు.