తెలంగాణలో మూడోసారి ముచ్చటగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉవ్విళ్లూ ఊరుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి నేత రాజకీయాయ వ్యూహాలతో ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఇక తండ్రికి తగ్గ తనయుడు.. మాటల్లో ఏ మాత్రం తీసి పోడని పేరు తెచ్చుకొన్న మంత్రి కేటీఆర్ ((Minister KTR) మరోసారి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు.
కాంగ్రెస్ (Congress) పార్టీ కరప్షన్‌కు కేరాఫ్ అని.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్న మీరు తెలంగాణ (Telangana)కు వచ్చి నీతి వాక్యాలు వల్లెవేస్తున్నారా అని రాహుల్ గాంధీపై (Rahul Gandhi) కేటీఆర్ ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించినప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో బొందపెట్టిన పార్టీ మీదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తన్న పార్టీ మాది. మీరు మాత్రం నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తున్నారని అన్నారు. మిమ్మల్ని నమ్మేదెవరంటూ ఆరోపించారు.
శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్‌కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదని, తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే వందల మంది బలిదానాలకు కారణమని కేటీఆర్ అన్నారు.. అంతా కలిసి మూడు రోజుల పర్యటన చేసినా మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా.. కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు..