Telugu News » Telangana Weather: అప్పటి వరకు ఉక్కపోత తప్పదు.. వాతావరణ శాఖ..!

Telangana Weather: అప్పటి వరకు ఉక్కపోత తప్పదు.. వాతావరణ శాఖ..!

. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 0 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. కాగా ఈ నెలలో అత్యల్పంగా వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని అన్నారు.. మరోవైపు ప్రతి సంవత్సరం మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 20 తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు.

by Venu

తెలంగాణలో (Telangana) గత కొన్ని నెలలుగా విచిత్ర వాతావరణం (Weather) నెలకొంటున్న విషయం అందరూ గమనించే ఉంటారు. వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన కాలం ప్రస్తుతం వేడితో ప్రజలను ఆగం చేస్తోంది. చాలా చోట్ల ఎండ, వేడి వల్ల ఉక్కపోత.. మరోవైపు సాయంత్రం అయితే కాస్త చలి.. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ ఓ ముఖ్య విషయం తెలిపింది. గత ఏడు రోజులుగా హైదరాబాద్‌ (Hyderabad)లో 31 డిగ్రీల నుంచి 33 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, నవంబర్ రెండో వారం వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని IMD అధికారులు తెలిపారు.

నవంబర్ 15 తర్వాత చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 0 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. కాగా ఈ నెలలో అత్యల్పంగా వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని అన్నారు.. మరోవైపు ప్రతి సంవత్సరం మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 20 తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు.

ఇక జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆగస్టులో కూడా చాలా తక్కువ వర్షం కురిసినా సెప్టెంబర్‌లో మాత్రం బాగానే కురిసింది. 2020, 2021, 2022 లో రుతుపవనాల ఉపసంహరణ వరుసగా అక్టోబర్ 27, అక్టోబర్ 20, అక్టోబర్ 22 తేదీల్లో జరిగింది.. కానీ ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 17న వెనక్కి తగ్గాయి. వర్షాలు తగ్గాయి. అందువల్ల ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 34 నుంచి 36 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు.

You may also like

Leave a Comment