Telugu News » Pravallika Suicide : ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్..!!

Pravallika Suicide : ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్..!!

శివరామ్ ను థానెలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా శివరామ్ ను రేపు కోర్టులో ప్రవేశపెట్టాక.. కస్టడీ రిమాండ్ కోరే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.. మరోవైపు శివరాంను ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు అనుకొంటున్నారు.

by Venu

హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవల్లిక (Pravalika) ఘటన గతకొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ప్రవల్లిక ప్రియుడు శివరాం (Shivaram)వల్లే ఆత్మహత్యకు (Suicide) పాల్పడిందని పోలీసులు (Police) వెల్లడించారు. ఈ క్రమంలో శివరాంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు కూడా చేశారు. మరోవైపు శివరాం ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కాగా బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.

ఈ క్రమంలో శివరామ్ మహారాష్ట్రకు (Maharastra) పారిపోయినట్టు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శివరామ్ ను థానెలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా శివరామ్ ను రేపు కోర్టులో ప్రవేశపెట్టాక.. కస్టడీ రిమాండ్ కోరే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.. మరోవైపు శివరాంను ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు అనుకొంటున్నారని సమాచారం.

ఇప్పటికే ప్రవల్లిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. మరోవైపు ప్రవల్లిక మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగడం, సహచరులు గ్రూప్ (Group-2) పరీక్షల వాయిదాల వల్లే మానసిక ఒత్తిడితో చనిపోయిందని ఆరోపించడంతో ఈ విషయం రాజకీయరంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో అశోక్ నగర్​లో ఆందోళనకు దిగిన పలు రాజకీయ పార్టీల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులను రెచ్చగొట్టారనే కారణంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజైవైఎం నాయకుడు భానుప్రకాష్, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అనీల్ కుమార్, విజయారెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.

You may also like

Leave a Comment