Telugu News » Rahul Gandhi : తెలంగాణ ధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందంటే.. రాహుల్ గాంధీ!?

Rahul Gandhi : తెలంగాణ ధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందంటే.. రాహుల్ గాంధీ!?

2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకుందని, తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాత్రం మాట నిలబెట్టుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ధనం ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూస్తున్నామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతామని రాహుల్ అన్నారు.

by Venu

తెలంగాణలో (Telangana) ఎన్నికల ప్రచారం జోరందుకోంది. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ (Congress).. గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ (BRS)తమ బలాన్ని అంతా ఉపయోగించి ఢీ అంటే ఢీ అంటూ సభలను నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో పర్యటిస్తూ, బీఆర్ఎస్ వైఫల్యాలు ప్రధాన అస్త్రాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు జరగనున్నాయని, తెలంగాణలో అవినీతి ప్రభుత్వం నెలకొందని రాహుల్ ​గాంధీ అన్నారు. ఇక్కడ అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని రాహుల్ గాంధీ విమర్శించారు.

తెలంగాణతో గాంధీ కుటుంబానిది రాజకీయ బంధం కాదని, ప్రేమానుబంధం అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. కేసీఆర్ (KCR) అవినీతి పై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ (BJP)పై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంటే.. ఎంఐఎం (MIM)పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను బరిలో నిలిపి బీజేపీకి సహకరిస్తోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి మద్దతు తెలిపిందని.. రైతు చట్టాలకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం కోసం.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం నేడు ఉందని పేర్కొన్నారు.

మోదీ, అదానీ మంచి స్నేహితులని.. అదానీ తీసుకున్న అప్పులను బీజేపీ మాఫీ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. కానీ మహిళలు స్వయం ఉపాధి కింద తీసుకున్న రుణాలను మాత్రం ఎందుకు మాఫీ చేయదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకుందని, తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాత్రం మాట నిలబెట్టుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ధనం ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూస్తున్నామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతామని రాహుల్ అన్నారు.

దేశంలో ప్రజలు కొనే ప్రతి వస్తువుపై జీఎస్టీ వసూలు చేస్తోన్న బీజేపీ రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్(CM KCR), ఆయన పరివారం.. రాష్ట్రంలో సంపదను ఎలా దోచుకుందో ప్రజల ముందు ఉంచుతామని రాహుల్ తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్ దళితులకు.. మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ అమలైందా? అని ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలను.. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ అనంతరం బస్సు యాత్రలో పాల్గొని పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్నారు.

You may also like

Leave a Comment