ఆత్మహత్యకు (Suicide) పాల్పడిన ప్రవల్లిక (Pravallika) ఘటనలో రోజుకో కొత్త ట్విస్ట్ చోటు చేసుకొంటుంది. ఇప్పటికే ప్రవల్లిక ప్రేమ (Love)వల్ల ఆత్మహత్య చేసుకొందని పోలీసులు, ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు. మరోవైపు ప్రవల్లిక మరణానికి కారణమంటూ శివరామ్ రాథోడ్ (Shivaram) అనే యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలో మరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు శివరామ్ బంధువులు.
నిందితుడిగా పేర్కొంటున్న శివరామ్ ఎలాంటి తప్పు చేయలేదని.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను (State Human Rights Commission) కలిసారు అతని కుటుంబ సభ్యులు. శివరామ్ రాథోడ్ హైదరాబాదులో సంవత్సరం నుంచి ఉంటూ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపారు. ప్రవల్లిక కేసులో శివరామ్ రాథోడ్ కి ఎటువంటి సంబంధం లేకున్నా అతన్ని నిందితుడిగా చిత్రీకరించడం హేయమైన చర్య అని శివరామ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కావాలని లవ్ ఎఫైర్ ఉందంటూ ఈ కేసులో శివరామ్ ని ఇరికిస్తున్నారని ఆరోపించారు.
నిన్నటి నుండి మమ్మల్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి వేధిస్తున్నారని శివరామ్ బంధువులు కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ కి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు శివరామ్ ఎక్కడున్నా డో మాకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా శివరామ్ కుటుంబం మహారాష్ట్రలోని పూణేలో ఉంటున్నట్టు సమాచారం..